Skip to main content

Namaste NRI

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) Mega Convention 2026 కు ఏర్పాట్లు పూర్తి

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) Mega Convention 2026 కు ఏర్పాట్లు పూర్తి చేశారు. జులై 17-19 వరకు TTA సంబరాలు అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు జరగనున్నాయి. అతిరథ మహా రథులు ఇప్పటికే చేరుకున్నారు. తరలివచ్చిన అతిదులకు టిటిఏ నాయకులు ఘన స్వాగతం పలికారు. నార్త్ కరోలినా లోని షార్లెట్ నగరం ఈ మెగా వేడుకలకు వేదికైంది. ఒక్కో కార్యక్రమానికి ఒక్కో ప్యానల్ ఏర్పాటు చేసి అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వేదిక అలంకరణ నుండి అతిదుల స్వగతం, వసతి, రవాణా, భోజన, వినోద , సన్మానం, శ్రీనివాస కల్యాణం, వివాహా పరిచయ, లైవ్ మ్యూజిక్, బిజినెస్, షాపింగ్,పొలిటికల్, మీడియా, విద్యా, మీట్ అండ్ గ్రీట్,ఉమెన్ కార్యక్రమాల మొదలైన విభిన్నమైన కార్యక్రమాలు విశేషంగా ఏర్పాటు చేశారు.

టిటిఏ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది అన్ని కార్యక్రమాల చైర్స్ , కో చైర్స్ సమన్వయం చేసుకుంటూ కన్వీనర్ ప్రవీణ్ చింతా తో కలిసి కన్వెన్షన్ ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి ముక్యమైన సినీ, రాజకీయ, ఆద్యాత్మిక , సాహితీవేత్తలు, కళాకారులను ఆహ్వానించారు. శుక్రవారం బాంకెట్ డిన్నర్ తో ప్రారంభమై, శనివారం,ఆదివారం వివిధ కార్యక్రమాలతో తెలంగాణ సంసృతిని, సంప్రదాయాలను అమెరికాలోని షార్లెట్ వేదికగా సంబరాలు జరుపుకొడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కీరవాణి సంగీతం, ఆర్ పీ పట్నాయక్, సినీ ప్రముఖులు దిల్ రాజు, శ్రీ విష్ణు, సునీల్, నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి, సుమా కనకాల, రవి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి మొదలైన సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకులు డా. పైళ్ల మల్లారెడ్డి, అడ్వజరీ కౌన్సిల్ చైర్ డా. విజయ్ పాల్ రెడ్డి, కోచైర్ డా. మోహన్ రెడ్డి పటోళ్ల , సభ్యులు భరత్ రెడ్డి మాదాడి, వంశీ రెడ్డి కంచరకుంట్ల , శ్రీని అనుగుల సారధ్యం మరియు సలహాలతో కన్వెంన్షన్ ఏర్పాట్లు పూర్తి చేశారు.

Social Share Spread Message

Latest News