Skip to main content

Namaste NRI

అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మరో సినిమా.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్ పోస్టర్

లికంలో కొందరు పళ్ళ బురుసు అని పిలుస్తుంటరు. ఇప్పుడు అదే పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్నది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌, ఆదిత్య పిట్టి, వివేక్‌ కృష్ణన్‌ కలిసి నిర్మిస్తున్నారు. సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్‌ ప్రధాన పాత్రధారులు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్‌ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సంస్కృతి, ప్రాంతీయతను ప్రతిబింబించే వినోదభరితమైన కామెడీ డ్రామా ఇదని ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చెబుతున్నది.

జిల్లా కోర్ట్‌ ఆవరణలో పెద్ద టూత్‌బ్రెష్‌ని త్రాసులా ఉంచి, దానిపై అటొకరు ఇటొకరు ఎడమొహం పెడమొహంలా కూర్చున్న తండ్రీకొడుకుల్ని ఈ పోస్టర్‌లో చూడొచ్చు. ఈ వినూత్నమైన విజువల్‌ సినిమా కథపై ఆసక్తిని రేకెత్తిస్తున్నది. సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్‌ తండ్రీకొడుకులుగా నటిస్తుండగా, ప్రజ్వల్‌, గోమతి, కిరణ్‌ మాచా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఆగస్ట్‌ 14న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి కెమెరా: వినోద్‌ కె.బంగారి, సంగీతం: పవన్‌ సీహెచ్‌, సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్‌, ఎపిక్‌ స్టూడియోస్‌.

Social Share Spread Message

Latest News