Skip to main content

Namaste NRI

కాళాంకి భైరవుడు చిత్రం నుండి.. ఏంటో ఏమో పాట విడుదల

గ్రామీణ నేపథ్యంలో రూపొందిస్తున్న మిస్టికల్‌ థ్రిల్లర్‌ కాళాంకి భైరవుడు. హరిహరన్‌ దర్శకత్వం . ఈ చిత్రాన్ని కె.ఎన్‌.రావు, డా॥ రాచమల్ల శ్రీనివాస రావు తెరకెక్కిస్తున్నారు. రాజశేఖర్‌ వర్మ, రితికాచక్రవర్తి, పూజ కిరణ్‌, భవ్యశ్రీ కీలక పాత్రధారులు.

ఇటీవలే విజయవాడలో ఈ సినిమాలోని ఏంటో ఎమో అనే మెలోడీ గీతాన్ని ఆవిష్కరించారు. బ్లాక్‌మేజిక్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తీశామని, అనుక్షణం సస్పెన్స్‌ ప్రధానంగా అనూహ్య మలుపులతో ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్‌ అనుభూతినిచ్చే చిత్రమిదని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పీఆర్‌, దర్శకుడు: హరిహరన్‌.

Social Share Spread Message

Latest News