Skip to main content

Namaste NRI

ట్రంప్-నెతన్యాహు భేటీ.. ఇరాన్‌పై ఫైనల్ గేమ్‌కు రంగం సిద్ధం

ఇరాన్‌పై నెలల తరబడి సాగిస్తున్న దాడులు ఆ దేశాన్ని తమ నియంత్రణలోకి తీసుకురావడంలో విఫలమైన నేపథ్యంలో ఇస్లామిక్‌ రిపబ్లిక్‌పై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌ ఏదో ఒక రకమైన భూ దిగ్బంధనాన్ని అమలు చేసే విషయంపై చర్చలు సాగిస్తున్నాయి. ఈ భూ దిగ్బంధం కొంతకాలంగా అమలవుతున్న సముద్ర దిగ్బంధనానికి అనుబంధంగా ఉండవచ్చని తెలిసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు పరిశీలనలో ఉన్న అనేక ప్రతిపాదనల్లో ఇది ఒకటి. మంగళవారం ఓవల్‌ ఆఫీసులో సమావేశమైన సందర్భంగా ట్రంప్‌, నెతన్యాహు గతిశీల, గతిశీల యేతర మార్గాల ద్వారా ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచే విషయాన్ని చర్చించినట్లు తెలిసింది. ఎగుమతులు, దిగుమతుల ప్రవాహాన్ని అడ్డుకునేందుకు సరిహద్దు మార్గాలను పటిష్టం చేయాలని ఇరాన్‌కు పొరుగున ఉన్న దేశాలు, ప్రాంతీయ భాగస్వామ్య దేశాలపై తమ ప్రణాళిక అమలు కోసం ఒత్తిడి తీసుకురావలసి ఉంటుందని రెండు దేశాల నాయకులు భావిస్తున్నారు.

Social Share Spread Message

Latest News