నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సికింద్రాబాద్ నేపథ్య పీరియాడిక్ చిత్రం ది ప్యారడైజ్. నిర్మాణ దశ నుంచే ఈ సినిమా భారీ హైప్‌ని క్రియేట్ చేస్తున్నది.ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో జడల్ అనే పవర్ఫుల్ పాత్రలో నాని కనిపించబోతున్నారు.

ఈ జాగా ఎవరిది? ఈ దేశమెవరిది? అంటూ నాని బిగ్గరగా నినాదాలు చేస్తూ తన వారిలో చైతన్యాన్ని రగిల్చే సన్నివేశాలతో టీజర్ ఆసక్తికరంగా మొదలైంది. ప్యారడైజ్ తాలూకు ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ తన జాతి జనుల కోసం ఆధిపత్య శక్తులతో పోరాడే యువకుడిగా నాని పాత్రను శక్తివంతంగా చూపించారు. అణచబడ్డ మన జాతి మర్లబడాలే ఛీ అని చీదరించుకున్న నలుపురంగే మన జెండా.కాకి దానిమీద గుర్తు. కాకులు తల్వార్లు పడితే ఏమవుతుందో చూపిద్దాం అంటూ నాని చెప్పిన సంభాషణలు టీజర్లో హైలైట్‌గా నిలిచాయి. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.





























