Skip to main content

Namaste NRI

ఇది మా సంస్థ నుంచి వస్తున్న కొత్త ప్రయత్నం: టీజీ విశ్వప్రసాద్‌

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం గరివిడి లక్ష్మ. ఆనంది టైటిల్‌ రోల్‌ని పోషించారు. గౌరినాయుడు జమ్ము దర్శకుడు. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, కృతిప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానున్నది. హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇది మా సంస్థ నుంచి వస్తున్న కొత్త ప్రయత్నం. ఇప్పటివరకూ సినిమా చూసినవారంతా మంచి ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చారు.

ఈ సినిమాను ఇప్పటివరకూ ఓ పదిహేనుసార్లు చూసుంటాను. చూసిన ప్రతిసారీ అదే ఎమోషన్‌ని క్రియేట్‌ చేసింది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. అందుకే ఒకరోజు ముందే ప్రీమియర్లు వేస్తున్నాం. ప్రభాస్‌గారితో త్వరలో ఓ సినిమా చేయబోతున్నాం అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ తెలిపారు. సినిమా చూసినవారందరి కళ్లలో నీళ్లు చూసినప్పుడు ఈ కథ వారి హృదయాల్ని ఎంతగా కదిలించిందో అర్థమైందని, తన కెరీర్లోనే ఇది మోస్ట్‌ ఛాలెంజింగ్‌ క్యారెక్టర్‌ అని నటి ఆనంది చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events