Namaste NRI

జపాన్ కీలక నిర్ణయం.. విదేశీ ప్రయాణికులపై

దక్షిణాఫ్రికాలో  కరోనా వేరియంట్‌ ఒమైక్రాన్‌ ప్రపంచ దేశాల్లో గుబులు పుట్టిస్తోంది. ఇంతకు ముందు వేరియంట్లతో పోల్చితే ఒమైక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. దీంతో కరోనా ఆంక్షలను మళ్లీ అమలు చేస్తున్నాయి.  ఈ క్రమంలో జపాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రయాణికులపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి ఈ నిబందనలు అమలులోకి వస్తాయని ఆ దేశ ప్రధాని పుమియో కిషిదా తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.         

Social Share Spread Message

Latest News