వలసలను అరికట్టేలా ఇప్పటికే ఉన్న అన్ని విధానాలను అమెరికా ప్రభుత్వం కఠినతరం చేయనుంది. గ్రీన్‌కార్డు, పౌరసత్వం, ఆశ్రయం వంటి ప్రయోజనాలు పొందేందుకు వలసదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడాన్ని తప్పనిసరి చేయనుంది. మెరుగైన సేవలు అందించేందుకు, నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఈ కొత్త నిబంధనను తీసుకువచ్చింది.

ఈ మేరకు కొత్త నిబంధనను ఫెడరల్ రిజస్టర్‌లో సోమవారం పబ్లిష్ చేసింది. దాంతో ఈ అప్లికేషన్లు ఆన్లైన్లో 180 రోజులపాటు అందుబాటులో ఉంటే, వాటిని ఆ తర్వాత పూర్తిగా ఈ ఫైలింగ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. గ్రీన్‌కార్డు దరఖాస్తులు, రెన్యువల్స్, ఫ్యామిలీ బేస్డ్ పిటిషన్లు, పౌరసత్వం కోసం, ఆశ్రయం కోసం చేసుకునే అభ్యర్థనలు, ఉపాధి అనుమతి దరఖాస్తులు, తాత్కాలిక రక్షిత హోదా ప్రయోజనాలు పొందేందుకు వలసదారులు ఈ ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.





























