Skip to main content

Namaste NRI

సంక్రాంతి బరిలో సంబరాల ఏటిగట్టు

హీరో సాయిదుర్గతేజ్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా యాక్షన్‌ డ్రామా సంబరాల ఏటిగట్టు. ఐశ్వర్యలక్ష్మి కథానాయిక. రోహిత్‌ కేపి దర్శకుడు. కె.నిరంజన్‌రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 12న సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్‌ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో సాయిదుర్గతేజ్‌ ఇంటెన్స్‌ మాస్‌ అవతారంలో కనిపిస్తున్నారు.

గాయాలతో నిండిన శరీరంతో రక్తం కారిపోతున్నా లెక్కచేయకుండా, మంటల మధ్య ఆయుధాన్ని చేతబూని పరుగెడుతూ టెర్రిఫిక్‌గా సాయిదుర్గతేజ్‌ కనిపిస్తున్నారు. గొప్ప సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చే సినిమా ఇదని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: బి.అజనీష్‌ లోక్‌నాథ్‌, నిర్మాణం: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events