Skip to main content

Namaste NRI

అడివి శేష్ చేతుల మీదుగా అ ఫస్ట్ లుక్ విడుదల

రాహుల్‌ విజయ్‌, అర్చన అయ్యర్‌ జంటగా నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ అ. సాయిబాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కనకరావు తొనంగి, అభిషేక్‌, గ్యారీ బీహెచ్‌ నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకానుంది. ఈ సినిమా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను హీరో అడివి శేష్‌ ఆవిష్కరించారు.

టైటిల్‌ పోస్టర్‌పై అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ అనే పదాలు ఇదొక పరిశోధనాత్మక థ్రిల్లర్‌ అని, ఓ అమ్మాయి అన్వేషణలో కథ సాగుతుందని తెలియజేస్తున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: మోనిష్‌ భూపతిరాజు, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, నిర్మాణ సంస్థ: స్టార్‌బాక్స్‌ స్టోరీస్‌, రిప్పుల్‌ ైస్లెడ్‌ స్టూడియోస్‌, దర్శకత్వం: సాయి బాలి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events