అనీష్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న చిత్రం ఇట్లు అర్జున. మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా నుంచి చిన్ని చిన్ని అనే పాటను విడుదల చేశారు. తమన్ స్వరపరచిన ఈ పాటను కల్యాణ్ చక్రవర్తి రచించారు. మోహిత్‌చౌహాన్ ఆలపించారు.

అందమైన ప్రేమభావనలకు అద్దంపడుతూ ఈ పాట సాగింది. విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇదని, సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రాన్ని వాట్ నెక్ట్స్ పతాకంపై వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు.















