భారతీయ ఎన్నికల వ్యవస్థను అమెరికా ఆదర్శంగా తీసుకోవాలని భావిస్తున్నది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ కామెంట్ చేశారు. భారత ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఎలా సాగుతుందో, ఆ రీతిలో ఓటర్ ఫోటో ఐడీ కార్డులను మనం కూడా తీసుకురావాలని ట్రంప్ పేర్కొన్నారు. ఇటీవల భారత ముఖ్య ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ అమెరికా ప్రభుత్వ పెద్దలతో భేటీ అయ్యారని, ఫోటో ఐడీ లేకుండానే ఎలా అమెరికాలో ఎన్నికలను నిర్వహిస్తున్నారని సీఈవో జ్ఞానేశ్ ప్రశ్నించారని ట్రంప్ పేర్కొన్నారు. భారతీయ ఎన్నికల ప్రక్రియను మెచ్చుకున్నారు.

గత జాతీయ ఎన్నికల్లో సుమారు 64.6 కోట్ల మంది ఓటు వేశారాని, దాంట్లో ఒక్క శాతం కన్నా తక్కువ సంఖ్యలో ఓటర్లు మెయిల్ ద్వారా ఓటు వేశారని, ప్రతి సింగిల్ ఓటర్‌కు ప్రత్యేకంగా ఫోటో ఐడీ కార్డు ఉందని, అయితే అదే తరహాలో అమెరికాలోనూ ఓటరు ఫోటో ఐడీలు కావాలని, దీని కోసం రూపొందించిన అమెరికా సేవ్ (సేఫ్‌గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబలిటీ) యాక్ట్‌ను ఉభయసభల్లో పాస్ చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ వెల్లడించారు.















