Skip to main content

Namaste NRI

బావ బామ్మర్ది సౌజన్యంతో ..జనవరి 12న

వెంకటేష్‌, కల్యాణ్‌రామ్‌తో అనిల్‌ రావిపూడి భారీ మల్టీస్టారర్‌ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సాహు గారపాటి నిర్మాత. ఈ చిత్రానికి జనవరి 12 విడుదల అనే ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ను ఖరారు చేశారు. వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు.


ఈ సందర్భంగా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు నివాళిగా ఆయన దర్శకత్వం వహించిన అప్పుల అప్పారావు చిత్రంలోని పాపులర్‌ కామెడీ సీక్వెన్స్‌తో ఈ వీడియో మొదలైంది. ఇందులో చిత్ర నాయకానాయికలు వెంకటేష్‌, కల్యాణ్‌రామ్‌, కీర్తిసురేష్‌, కృతిశెట్టి, దర్శకుడు అనిల్‌ రావిపూడి మధ్య జరిగిన సరదా సంభాషణ నవ్వుల్ని పంచింది. బావ బామ్మర్ది సౌజన్యంతో అనే ట్యాగ్‌లైన్‌ సినిమాలో వెంకటేష్‌, కల్యాణ్‌రామ్‌ పాత్రల మధ్య ఉన్న రిలేషన్‌ను తెలియజేసేలా ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events