Skip to main content

Namaste NRI

డాలస్‌లో డా.భానుమతికి ఘన సత్కారం

90 ఏళ్ల వయస్సులో అమెరికాలో 50 సంవత్సరాలకు పైగా జీవితం గడిపిన ఇకపై మాతృదేశంలో జీవించేందుకు భారత్‌కు పయనమవుతున్న ప్రముఖ సామాజిక సేవకురాలు డా.భానుమతిని డాలస్‌లో ఘనంగా సత్కరించారు. గత కొన్నేళ్లుగా పార్క్‌ల్యాండ్ హాస్పిటల్, డాలస్ కౌంటీ ఫ్యామిలీ కోర్ట్ సర్వీసెస్, డాలస్ కౌంటీ చైల్డ్ వెల్ఫేర్ తదితర సంస్థల ద్వారా భానుమతి సేవలందించారు. అవసరమైన వారికి వ్యక్తిగతంగానూ అండగా నిలిచారు. ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా పూర్వ అధ్యక్షులు డా.ప్రసాద్ తోటకూర, షబ్నం మాడ్గిల్, తైయాబ్ కుండావాల, సుష్మా మల్హోత్రా, సత్యన్ కల్యాణ్ దుర్గ్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, శ్రీధర్ కోడెల, డా.నరసింహారెడ్డి ఊరిమిండి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు, రామకృష్ణ నూనె, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఉత్తరాధ్యక్షులు సతీష్ రెడ్డి, నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ పూర్వాధ్యక్షులు బాపు నూతి, తానా బోర్డు పూర్వ కార్యదర్శి మురిళి వెన్నం, కమ్యూనిటీ నాయకులు ఎం.వి.ఎల్ ప్రసాద్, రావు కల్వల, డా. జగదీశ్వరన్ పుడూర్ తదితరులు భానుమతిని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు.

ఈ సందర్భంగా భానుమతి మాట్లాడుతూ ఇర్వింగ్‌లోని మైత్రీ ఇండియన్ రెస్టారెంట్‌లో ఈ ఆత్మీయ సమావేశానికి విచ్చేసి జయప్రదం చేసిన వారందరికీ, కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. తన సుదీర్ఘ సామాజిక సేవా ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సభాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ సమస్యకు పరిష్కారానికి మధ్య, వివాదానికి అవగాహనకు, మధ్య, గందరగోళానికి సృష్టతకు మధ్య, నిరాశకు ఆశకు మధ్య డా.భానుమతి ఒక దిక్సూచీగా నిలిచారని అన్నారు. 50 సంవత్సరాలకు పైగా అమెరికాలో జీవితం గడిపి, తొమ్మిది పదులు దాటిన వయసులో మాతృదేశంలో తన జీవితం గడపాలనుకోవడం హర్షణీయమని, సుఖ సంతోషాలతో డా. భానుమతి జీవితం గడవాలని ఆకాంక్షించారు.

వివిధ సంధర్భాల్లో డా.భానుమతి ఇవటూరితో కలిసి పనిచేసిన ఎం.వి.ఎల్ ప్రసాద్, రావు కల్వల, సత్యన్ కల్యాణ్ దుర్గ్, డా.కృష్ణబాబు చుండూరి, డా.కిశోర్ సుంకర, రాధికా కోడెల, రామకృష్ణ నూనె, డోరిస్ మార్షల్, స్యూ యాన్ రూత్, అవ్యం రమణి ప్రబృతులు ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Social Share Spread Message

Latest News