Skip to main content

Namaste NRI

ఫిలడెల్ఫియాలోని కింగ్ ఆఫ్ ప్రష్యాలో తానా (TANA) మిడ్-అట్లాంటిక్ ‘విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్’ విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో కమ్యూనిటీకి ఉపయోగ పడేలా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 29వ తేదీన ఫిలడెల్ఫియాలోని కింగ్ ఆఫ్ ప్రష్యాలో తానా మిడ్ అట్లాంటిక్ విభాగం ఏర్పాటు చేసిన ‘విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్’ కార్యక్రమం కూడా విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి 60 మందికి పైగా హాజరై వివరాలను తెలుసుకున్నారు. తానా సభ్యులతో పాటు సభ్యులు కాని వారికి కూడా ఇందులో ప్రవేశాన్ని కల్పించారు. ‘చుగ్ ఫైనాన్షియల్ సర్వీసెస’ వారు ఉదారంగా ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించడమే కాకుండా, ఉచితంగా తమ ‘విల్ అండ్ ట్రస్ట్ డ్రైవ్’ ప్లానింగ్ పూర్తి చేసుకునే అవకాశాన్ని కల్పించారని తానా బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు తెలిపారు. ఈ కార్యక్రమంలో విల్ అండ్ ట్రస్ట్ ప్రాముఖ్యతను తెలియజేశారు.

ఈ ఈవెంట్‌ను ఎంతో పక్కాగా ప్లాన్ చేసి, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సమర్థవంతంగా నిర్వహించారు. పాల్గొన్న కుటుంబాలకు ప్రత్యేక సమయ స్లాట్‌లను కేటాయించి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రక్రియ పూర్తయ్యేలా చూశారు.కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడంతోపాటు విజయవంతం చేసిన తానా మిడ్ అట్లాంటిక్ టీమ్ ను తానా బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి అభినందించారు. అలాగే, ‘చుగ్ ఫైనాన్షియల్ సర్వీసెస’ ద్వారా సమాజానికి నిరంతరం సేవలు అందిస్తూ, ఈ ఈవెంట్‌కు ఉదారంగా స్పాన్సర్‌షిప్ అందించిన సతీష్ నల్లాను ఆయన సత్కరించారు. ఈ కార్యక్రమ విజయానికి విశేష సహకారం మరియు సేవలు అందించిన రంజిత్ మామిడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి మరియు బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు ఈ కార్యక్రమం చక్కగా విజయవంతమయ్యేందుకు మార్గదర్శకత్వం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events