Skip to main content

Namaste NRI

కొండా సురేఖ బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం

తెలంగాణ మంత్రి మండలి నుంచి కొండా సురేఖను తొలగించేందుకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ఆమోదం తెలిపారు. మంత్రి మండలి నుంచి కొండా సురేఖను బర్తరఫ్‌ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన సిఫార్సును గవర్నర్‌ ఆమోదించినట్లు లోక్‌భవన్‌ ప్రకటించింది.

అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొండా సురేఖను మంత్రి మండలి నుంచి తొలగించాలన్న సిఫార్సును గవర్నర్‌కు అందజేసినట్లు తెలిసింది. అనంతరం గవర్నర్‌ ఆమోదం తెలిపినట్లు లోక్‌భవన్‌ నుంచి ప్రకటన వెలువడింది. సీఎం సమక్షంలోనే గవర్నర్‌ సిఫార్సుపై సంతకం చేసినట్లు సమాచారం. దీంతో తెలంగాణ మంత్రి మండలి నుంచి కొండా సురేఖ తొలగింపు అధికారికంగా ఖరారైంది.

Social Share Spread Message

Latest News