Skip to main content

Namaste NRI

విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబినేషన్‌లో మణిరత్నం మూవీ

తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్లలో టాప్‌లో ఉంటారు విజయ్‌ సేతుపతి, సాయి పల్లవి. ఈ ఇద్దరూ రొమాంటిక్‌ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలిసిందే. థగ్‌ లైఫ్‌ డిజాస్టర్‌ తర్వాత లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఈ మూవీకి ఇంజి వెల్లం (అల్లం బెల్లం) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.లీడ్ పెయిర్‌పై డిజైన్ చేసిన మోషన్ పోస్టర్‌ను కూడా లాంచ్ చేశారు.

ఈ చిత్రాన్ని 2027 జనవరిలో విడుదల చేయనున్నట్టు కూడా ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌, ఇండియా టాకీస్‌ బ్యానర్లతో కలిసి మద్రాస్‌ టాకీస్‌ తెరకెక్కిస్తోంది. ఆస్కార్‌ విన్నర్‌ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Social Share Spread Message

Latest News