హర్ష్ రోషన్ హీరోగా రూపొందుతున్న యువతరం ప్రేమకథ తెల్ల కాగితం. నక్షత్ర కథానాయిక. రమేశ్ బండ్రెడ్డి దర్శకుడు. కృష్ణ కొమ్మాలపాటి నిర్మాత. అక్టోబర్ 2న సినిమా విడుదల కానున్నది.టీజర్ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు బాబీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ జీవితంలో తెలిసీ తెలియక అందరూ తప్పులు చేస్తుంటారనే విషయాన్నే ఈ సినిమాతో చెప్పాలనుకున్నారు. అదే తెల్ల కాగితం మీద ఎర్ర మచ్చ పడితే ఎలా ఉంటుందనేదే కథ. అదే ఈ సినిమా. తెల్లకాగితం మూవీ ఇన్నోసెంట్ లవ్‌స్టోరి. యూత్‌కి, ఫ్యామిలీస్‌కి కనెక్ట్ అయ్యే సినిమా. నిర్మాత కృష్ణతో నాకు ఇరవైయేళ్ల జర్నీ. ఈ సినిమాకు అన్నీ రకాలుగా వెనుకుండి సక్సెస్ వచ్చే వరకు ప్రయత్నం చేస్తుంటాం అని తెలిపారు.

హీరో హర్ష్ రోషన్ మాట్లాడుతూ ఇదొక సినిమా మాత్రమే కాదు..ఓ మంచి ఫీలింగ్. తెల్ల కాగితం అంటే ఏదో ఈ రాము కథో లేదా ఆశా కథో, లేకపోతే ఇంకెవరో స్నేహితుల కథో అని అనుకుంటారు. కానీ ఇది మనందరి కథ. పదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివిన ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే కథ ఇది. తప్పకుండా అందరికి నచ్చుతుంది అన్నారు.















