Skip to main content

Namaste NRI

ఇడుపు కాయితం సినిమా నుంచి శ్రీలత సాంగ్ రిలీజ్

సుకుమార్‌ రైటింగ్స్‌, బన్నీ వాస్‌ వర్క్స్‌ పతాకాలపై రానున్న తెలంగాణ నేపథ్య కుటుంబకథా చిత్రం ఇడుపు కాయితం. ప్రియదర్శి హీరోగా, నాగదుర్గ కథానాయిక. వంశీరెడ్డి దొండపాటి దర్శకుడు. బన్నీ వాస్‌ నిర్మాత. మ్యూజిక్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి శ్రీలత అంటూ సాగే పాటను మేకర్స్‌ విడుదల చేశారు. శ్రీలత శ్రీలత శ్రీలత.. నువ్వు సిన్నబోకే నా శ్రీలత.. శ్రీలత శ్రీలత శ్రీలత.. ఈ శ్రీనివాసుడే నీ జత.. జీలకర బెల్లాన్ని పెట్టినా.. ఆ నెత్తిపై భారాన్ని పెట్టనే అంటూ సాగే ఈ పాటను అలరాజు రాయగా, సురేశ్‌ బొబ్బిలి స్వరపరిచారు.

శంకర్‌బాబు, మోహన్‌ భోగరాజు ఆలపించారు. ఈ పాటలో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ పాటను చిత్రీకరించిన లొకేషన్లు, పిల్లలతో చేయించిన డ్యాన్స్‌ సీక్వెన్సులు పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్‌ అంటున్నారు. ప్రస్తుతం రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌ తొలివారం విడుదల చేయనున్నారు. శివజ్యోతి, సుజాత, చంద్రవ్వ, మౌనికరెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్‌ బేతిగంటి, మైమ్‌ మధు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎంఎన్‌ బాల్‌రెడ్డి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events