Skip to main content

Namaste NRI

మెగాస్టార్‌ చిరంజీవికి జోడీగా స్నేహ?

మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం కాకా పై టాలీవుడ్‌లో రోజురోజుకూ అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఓ క్రేజీ రూమర్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అప్పట్లో అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీనియర్ నటి స్నేహ, ఇప్పుడు మెగాస్టార్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.

కాకా చిత్రంలో స్నేహ చిరంజీవి భార్య పాత్రలో కనిపించనున్నారట. ఈ వార్త నిజమైతే కచ్చితంగా ఇది అభిమానుల కు పండగలాంటి వార్తే అవుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ భారీ మాస్ ఎంటర్‌టైనర్‌ను 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events