Skip to main content

Namaste NRI

ఫుల్‌జోష్‌లో రణబాలి …షూటింగ్ పూర్తి

పీరియాడిక్‌ డ్రామా రణబాలి చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. 19వ శతాబ్దం నాటి ఈ కథలో విజయ్‌ దేవరకొండ రణబాలి పాత్రలో కనిపించనుండగా, రష్మిక మందన్న జయమ్మ పాత్రను పోషించారు. వివాహానంతరం ఈ దంపతులు కలిసి నటించిన చిత్రమిదే కావడంతో ఈ ప్రాజెక్ట్‌ అందరిలో ఆసక్తిని పెంచుతున్నది. దాదాపు 130 రోజుల పాటు షూటింగ్‌ జరిగిందని, టీమ్‌ అంతా నిర్విరామంగా కష్టపడ్డామని చిత్ర దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ పేర్కొన్నారు.

మరో 29 రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకురానుందని పేర్కొన్నారు. ఈ మేరకు కౌంట్‌డౌన్‌ పోస్టర్‌ను పంచుకున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌లో శింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో విజయ్‌ దేవరకొండ పవర్‌ఫుల్‌ స్క్రీన్‌ప్రజెన్స్‌తో ఆకట్టుకున్నారు. 1854-1878 మధ్య బ్రిటీష్‌ పాలనా కాలంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దసరా కానుకగా అక్టోబర్‌ 16న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: అజయ్‌-అతుల్‌, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, రచన-దర్శకత్వం: రాహుల్‌ సంకృత్యాన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events