మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్‌లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కాక. ఈ సినిమా విడుదల తేదీపై నెలకొన్న అన్ని రకాల ఊహాగానాలకు చిత్ర యూనిట్ తాజాగా తెరదించింది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13, 2027న ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా పూర్తి స్థాయి మాస్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నారు. ఇదిలాఉంటే, సినిమా నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపారు.















