నాని హీరోగా రూపొందిన పీరియడ్ యాక్షన్ చిత్రం ది ప్యారడైజ్. కయాదు లోహర్ కథానాయిక. మోహన్‌బాబు ప్రత్యేక పాత్ర పోషించారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నాని మాట్లాడారు. ప్రేక్షకులకు గొప్ప మాస్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ది ప్యారడైజ్. ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ నెల 24న చూస్తారు. చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా తీశారు. నా గత చిత్రాలకు తమిళ ప్రేక్షకులు మంచి సపోర్ట్ ఇచ్చారు. నా కెరీర్‌లో ఇంత కష్టపడ్డ సినిమా లేదు. కచ్చితంగా ఈ సినిమా కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు మీరంతా నన్ను నాని అని పిలుస్తున్నారు. రేపు ఈ సినిమా విడుదలయ్యాక అంతా జడల్ అని పిలుస్తారు. సుబ్బుగా చేసిన కయాదు లోహర్, కీర్తి సురేశ్ క్యామియో, అనిరుధ్ సంగీతం ఈ సినిమాను నెక్ట్స్ లెవల్లో నిలబెట్టాయి అని అన్నారు.

ప్యారడైజ్ ఓ రెవల్యూషనరీ ఫిల్మ్ అని, నాని ఇందులో రెబల్‌గా కనిపిస్తారని, తన ప్రాంతం కోసం, ఉనికి కోసం, ప్రజల కోసం, తల్లి కోసం తను ఎలా పోరాడాడు అనేది ఇందులో ప్రధానాంశమని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అన్నారు. ఈ సినిమాను తమిళంలో విడుదల చేస్తున్న స్వరూప్ కూడా మాట్లాడారు. ఈ చిత్రం ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా పానిండియా స్థాయిలో విడుదల కానున్నది.















