యెమెన్లో హౌతీల దూకుడు పెరుగుతున్న వేళ, సౌదీ అరేబియాకు మరో షాక్ తగిలింది. ఒమన్ రాజధాని మస్కట్లో ఇరాన్ మద్దతున్న హౌతీలతో అమెరికా రహస్యంగా చర్చలు జరపడం సంచలనంగా మారింది. ఇప్పటికే హౌతీ లు వ్యూహాత్మక బాబ్ ఎల్-మాబ్ జలసంధిలో పట్టు పెంచుకున్నారు. సౌదీ చమురు ఎగుమతులతో పాటు ప్రపంచ వాణిజ్యానికి ఈ మార్గం కీలకం.ఇలాంటి సమయంతో సౌదీ మిత్ర దేశమైన యూఎస్ హౌతీలతో చర్చలు జరుపుతున్నట్టు జేడీ వాన్స్ తెలిపారు.

మస్కట్లో రహస్యంగా ఒప్పందం జరిగినట్టు తెలిసింది. ఈ చర్చల్లో ఎర్ర సముద్రంలో నౌకాయానం కొనసాగడం, అమెరికా-హౌతీల కాల్పుల విరమణ, యూఎస్, ఇజ్రాయెల్ నౌకలపై దాడులు చేయబోమని హౌతీలు హామీ ఇవ్వడంతో పాటు సౌదీపై దాడులు కొనసాగించడం లాంటివి ఉన్నాయని తెలిసింది.















