వై.శివశంకరనాయుడుతో కలిసి హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న చిత్రం హతః. అనుష్ గోరక్ దర్శకుడు. రెహమాన్, కుష్లు, తనూజ పుట్టుస్వామి, నమ్రిత ఎంవీ ప్రధాన పాత్రధారులు. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం మాట్లాడారు. హతః మాకు ప్రత్యేకమైన సినిమా. విడుదలకు ఇంకా 50రోజుల సమయం ఉన్నది. ఆడియన్‌ని ఆద్యంతం ఉత్కంఠకు గురిచేసే సినిమా హతః. నటీనటుల నటన, సాంకేతిక నిపుణుల పనితనం, ఇవన్నీ మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తాయి. ఇది నేను చూసి చెబుతున్నమాట. అన్ని ప్రాంతాలవారికీ నచ్చే సినిమా ఇది. దీపావళికి ఈ మూవీ ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నది అని అన్నారు.

పరిధులు లేని కథలు అరుదుగా వస్తాయి. అలాంటి అరుదైన కథే ఇది’ అని మరో నిర్మాత వై.శివశంకరనాయుడు పేర్కొన్నారు. మార్మిక అంశాలున్న థ్రిల్లర్ ఇదని, హారర్ కూడా ఉంటుందని, ఈ కథలో చాలా సీక్రెట్స్ ఉన్నాయని దర్శకుడు అనుష్ గోరక్ చెప్పారు.నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది.















