అపర కుబేరుడు వారెన్ బఫెట్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే పెట్టుబడుల కంపెనీ బెర్క్‌షైర్ హాత్వే సీఈవో పోస్ట్‌ను వదులుకున్న ఆయన ఈసారి చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అర్ధ శతాబ్దం పైగా చైర్మన్‌గా సేవలందించిన ఆయన బాధ్యతల నుంచి వైదొలిగారు. అందరూ వ్యాపారవేత్తల మాదిరిగానే ఆయన కూడా తన వారసుడు హొవార్డ్ బఫెట్‌ను తదుపరి చైర్మన్ చేయనున్నారు.

పెట్టుబడుల దిగ్గజం వారెన్ బఫెట్ ఏడాదిలో మరో పదవికి రాజీనామా చేశారు. బెర్ష్షైర్ హాత్వేను సంపన్న కంపెనీగా తీర్చిదిద్దిన బఫెట్ ఈ ఏడాది ఆరంభంలోనే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవిని వదులకున్నారు. ఈసారి ఆయన చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. 56 ఏళ్ల పాటు ఈ హోదాలో కొనసాగిన ఆయన తన వారసుడికి పగ్గాలు అప్పగించనున్నారు.

రిటైర్ అయినప్పటికీ ఈ కుబేరుడు చైర్మన్ ఎమిరిటస్‌గా వ్యవహరించనున్నారు. అనంతరం కుమారుడు హొవార్డ్ బఫెట్‌ని తదుపరి చైర్మన్ చేయనున్నారు బఫెట్. 1993 నుంచి బోర్డులో సభ్యుడిగా కొనసాగుతున్న హొవార్డ్, ఒరాకిల్ ఆఫ్ ఒమహలోనూ సేవలందిస్తున్నారు. బఫెట్ సీఈవోగా రాజీనామా చేసిన అనంతరం ట్రిలియన్ అమెరికా డాలర్ల మార్కెట్ విలువున్న కంపెనీని గ్రెగ్ అబెల్ చూసుకుంటున్నారు.















