Skip to main content

Namaste NRI

కీల‌క బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం!

రష్యా, ఇరాన్, చైనా, భారత్ లను ఒకేసారి దెబ్బతీసే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దాంతో రష్యా, ఇరాన్‌ లపై ఆంక్షలను విధించేందుకు, వాటితో వాణిజ్యం కొనసాగిస్తోన్న భారత్, చైనాల పై సుంకాల మోత మోగించేందుకు అధ్యక్షుడికి అధికారం దఖలు పడింది.

ద లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్‌ రష్యా అండ్‌ ఇరాన్‌ చట్టం-2026 పేరుతో తీసుకొచ్చిన బిల్లుకు సభ 262-159 ఓట్లతో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును గత నెలలోనే సెనెట్‌ ఆమోదించింది. ఇప్పుడు ట్రంప్ సంతకం చేయడంతో చట్టరూపం దాల్చింది. దాంతో భారత్ , చైనా తో సహా 10 దేశాలు ఆంక్షల పరిధిలోకి వచ్చాయి. భారత్ అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై ట్రంప్ సర్కార్ భారీగా సుంకాలు విధించనుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events