Skip to main content

Namaste NRI

ఆకట్టుకునే అమాయక ప్రేమకథగా తెల్ల కాగితం.. నిర్మాత దిల్‌ రాజు

కె.శ్రీదేవి సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్న చిత్రం తెల్ల కాగితం. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటిస్తున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు నందు సవిరిగాన అందిస్తున్నారు. ఈ మూవీకి రమేష్ బండ్రెడ్డి దర్శకుడు. ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నిర్మాత, టీఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, స్టార్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, కొరటాల శివ, చందు మొండేటి, వశిష్ట, శైలేష్ కొలను, రామ్ జగదీష్, నిర్మాత బండ్ల గణేష్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ గతంలో మా బ్యానర్ నుంచి వచ్చిన కొత్త బంగారు లోకం సినిమాలో ఎలాంటి అమాయకత్వంతో కూడిన ప్రేమకథ ఉందో, ఇందులోనూ అలాంటి ఫీల్ కనిపించిందని తెలిపారు. హీరో హర్ష రోషన్ మాట్లాడుతూ ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు ఒక మంచి అనుభూతితో వస్తాడని నమ్ముతున్నానని తెలియజేశారు. మూవీ డైరెక్టర్ రమేష్ బండ్రెడ్డి మాట్లాడుతూ హీరో రోషన్ సినిమాను తన భుజాలపై మోశాడు. హీరోయిన్ నక్షత్ర నటనలో జీవించేసింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నక్షత్ర. నందు సవిరిగాన, రఘురామ్, సురేష్ బానిశెట్టి, పూర్ణాచారి, శ్రావ్య, దీపక్, సంతోష్ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events