Skip to main content

Namaste NRI

టోక్యోలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

జపాన్ రాజధాని టోక్యోలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. జపాన్ తెలుగు సమాఖ్య (జేటీఎస్) ఆధ్వర్యంలో స్థానిక కోమట్సుగవా పార్కులో ఈ వేడుకలు వైభవంగా నిర్వహించారు. టోక్యో మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపు 200 మందికి పైగా తెలుగువారు కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.


భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించే దుస్తులలో మహిళలు, పిల్లలు బతుకమ్మ పాటలు పాడుతూ, చుట్టూ చప్పట్లు కొడుతూ నృత్యాలు చేశారు. పూలతో సుందరంగా తీర్చిదిద్దిన బతుకమ్మలను మధ్యలో ఉంచి గౌరమ్మను ఆరాధించారు. జేటీఎస్ వాలంటీర్లు సంబరాల్లో పాల్గొన్నవారికి పులిహోర, మిఠాయిలు పంచిపెట్టారు. సమిష్టి కృషితో కార్యక్రమాన్ని విజయవంతం చేశామని జేటీఎస్ వాలంటరీ మురళీధర్ పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events