
కెనడాలో ట్రాఫిక్ వివాదం ఓ భారత సంతతి మహిళ అరెస్టుకు దారితీసింది. కాల్గరీలో ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తున్న పాదచారుడికి దారి ఇవ్వకుండా కారును అతడి మీదికి దూసుకెళ్లేలా పోనిచ్చింది. దీనితో ఆ పాదచారుడు తన మొబైల్లో ఆ తతంగాన్ని వీడియో తీయడం ప్రారంభించాడు. కారులో నుంచి దిగిన ఆ మహిళ నన్ను వీడియో తీసే అధికారం నీకు ఎవరిచ్చారు? అంటూ అతనితో వాగ్వాదానికి దిగింది. అతని ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించడమే కాకుండా, అతని బ్యాక్‌ప్యాక్‌ను పట్టుకుని రోడ్డు పక్కకు లాగడానికి యత్నించింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో తరలించారు.















