
జపాన్ తెలుగు సమాఖ్య (JTS) ఆధ్వర్యంలో జపాన్ రాజధాని టోక్యోలోని కోమట్సుగావా పార్కులో బతుకమ్మ పండుగ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సుమారు 200 మంది ఈ సంబరాలలో ఉత్సాహంగా పాల్గొని, తెలంగాణ సంస్కృతీ వారసత్వంపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.”రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తులు ధరించి మహిళలంతా ఒకచోట చేరి ఆడి పాడారు. దీంతో కోమట్సుగావా పార్కు వద్ద పండుగ శోభను సంతరించుకుంది. తెలుగు సమాఖ్య వాలంటీర్ లు సంబరాలలో పాల్గొన్న వారికి పులిహోర, మిఠాయిలు పంచి పెట్టారు. సమిష్టి కృషితో ఈ కార్యక్రమం విజయవంతం అయిందని అసోసియేషన్ ప్రతినిధి మురళీధర్ పేర్కొన్నారు.















