
విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రణబాలి. రష్మిక హీరోయిన్‌గా నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ చిత్రం దసర కానుకగా అక్టోబర్ 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ మీడియాతో మాట్లాడారు.తన సినిమాలకు టికెట్ ధరలు పెంచాల్సిన అవసరం లేదని విజయ్ అన్నారు. అందుకు కారణం కూడా చెప్పారు. నా సినిమాలకు టికెట్ ధరల పెంపు వద్దని నేను చేసే సినిమా నిర్మాతలకు చెబుతుంటాను. అందుకు ఒక కారణం ఉంది. నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో మా నాన్న రోజూ నాకు రూ.10 ఇచ్చేవారు. దాన్ని దాచుకుని, వారమయ్యాక ఐమ్యాక్స్‌లో సినిమా చూడటానికి వెళ్లే వాడిని ఒకసారి టికెట్ ధరను రూ.100కు పెంచేశారు. ఇలా ఎలా పెంచేస్తారని చాలా బాధపడ్డా. నేను హీరో అయ్యాక నా సినిమాలకు టికెట్ ధరల పెంపుపై నిర్మాతలతో చర్చ జరిగితే వద్దని, నాకొచ్చే లాభాల్లో వాటా తీసుకోమని చెబుతా. ఒకవేళ రాజమౌళి సర్‌తో సినిమా చేస్తే తప్ప, ఇది తప్పకుండా కొనసాగేలా చేస్తా అని విజయ్ అన్నారు.















