Skip to main content

Namaste NRI

అ మూవీ నుంచి ఇదేనా ఇదేనా సాంగ్ రిలీజ్

రాహుల్‌ విజయ్‌, అర్చన అయ్యర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం అ. సాయి బాలి దర్శకత్వం. ఈ చిత్రాన్ని కనకరావు తొనంగి, అభిషేక్‌, గ్యారీ బీహెచ్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ఇదేనా ఇదేనా అంటూ సాగే పాటను విడుదల చేశారు. శ్రీచరణ్‌ పాకాల స్వరపరచిన ఈ పాటను షణ్ముఖ భరద్వాజ్‌ ఆలపించారు. సుమన్‌ చిక్కాల రచన చేశారు.

ఓ అమ్మాయి అదృశ్యం నేపథ్యంలో ఆమెను అన్వేషిస్తూ సాగే మిస్టరీ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఇదని, హీరో సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తారని దర్శకుడు తెలిపారు. ఆద్యంతం ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచే సినిమా ఇదని హీరో రాహుల్‌ విజయ్‌ పేర్కొన్నారు. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, దర్శకత్వం: సాయి బాలి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events