తండ్రీకూతుళ్ల అనుబంధమే ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం నాన్న కుట్టి. విజయ్ ఆంటోని ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ము.మారన్ దర్శకుడు. మీరా విజయ్ ఆంటోని నిర్మాత. నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రకటననూ, దానితోపాటు ఓ పోస్టర్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించేలా ఈ పోస్టర్‌ని డిజైన్ చేశారు.

ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మాధవ్, చిత్ర లక్ష్మణన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా రాజీవ్ రాజేంద్రన్, సంగీతం: విజయ్ ఆంటోని, సహ నిర్మాత: సర్వంత్‌రామ్ క్రియేషన్స్ రామాంజనేయులు జవ్వాజి.















