నవరాత్రుల తొలిరోజున రామాయణ మేకర్స్ ప్రత్యేక ప్రకటన చేశారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ఇతిహాసానికి చెందిన తొలి భాగాన్ని ఈ ఏడాది నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్‌లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో సినిమా విడుదల కానున్నది.

ఈ సందర్భంగా రణబీర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, రవి దూబే లక్ష్మణుడిగా, యశ్ రావణుడిగా కనిపిస్తున్న కొత్త పోస్టర్ని విడుదల చేశారు. కథలోని పాత్రల వ్యత్యాసాన్ని ప్రతిబింబించేలా ఈ పోస్టర్ని రూపొందించారు. భారీ సెట్లు, అద్భుతమైన ఆహార్యం, ఇలా ప్రతి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్టు ఈ పోస్టర్ చెబుతున్నది.

ఇది రాముడి యుగానికి ఆరంభం అనే సందేశంతో ఓ కొత్త శకానికి శ్రీకారం చుడుతున్నట్టు మేకర్స్ వెల్లడించారు. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా పౌరాణిక ఫ్రాంచైజీని నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, యశ్‌కి చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, డిఎన్ఇజి భాగస్వామ్యంతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.















