Skip to main content

Namaste NRI

పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్‌!

సౌదీ అరేబియా, టర్కీ లతో కలిసి పాకిస్థాన్ ఏర్పాటుచేసిన రక్షణ ఒప్పందం కార్యాచరణలోకి రావడంపై ఇరాన్ తీవ్ర స్వరంతో స్పందించింది. యెమెన్ విషయంలో జోక్యం చేసుకుంటే ఆ ప్రాంతంపై తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయని హెచ్చరించింది. ముఖ్యంగా అమెరికాతో చర్చల విషయంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ ఈ కూటమిలో చేరడంపై అభ్యంతరం వ్యక్తంచేసింది. సౌదీ మౌలిక సదుపాయాలపై హౌతీల క్షిపణి, డ్రోన్ దాడులు పెరగడంతో ఈ త్రైపాక్షిక ఒప్పందం అక్టోబర్ 5 నుంచి కార్యాచరణ దశలోకి వ‌చ్చింది. సౌదీ అరేబియాకు మద్దతుగా టర్కీ, పాకిస్థాన్ చర్యలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది పాకిస్థాన్ సైనికులను సౌదీకి పంపవచ్చనే దానిపై ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పందించారు.

ఈ నేప‌థ్యంలో యెమెన్ విషయంలో ఏ దేశం జోక్యం చేసుకున్నా ఆ ప్రాంతంలో అవాంఛనీయ పరిణామాలు తప్పవని బఘాయీ స్పష్టంచేశారు. అయితే టర్కీ కంటే పాకిస్థాన్‌పైనే ఇరాన్ తన విమర్శలను ఎక్కువగా కేంద్రీకరించింది. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య మధ్యవర్తిగా ఇస్లామాబాద్ పోషిస్తున్న ప్రముఖ పాత్రే ఇందుకు కారణం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events