తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇంద్రకీలాద్రి పై ఉన్న కనకదుర్గమ్మ ను దర్శించుకున్నారు.చెన్నై నుండి ప్రత్యేక విమానంలో విజయవాడ విమానాశ్రయం చేరుకున్న సిఎం విజయ్ నేరుగా దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయం అర్చకులు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదం అందజేశారు. విజయవాడ ఉత్సవ్ ఈరోజు పాల్గొంటున్నారు. ఆయన్ను చూడడానికి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.


దుర్గమ్మ దర్శనం అనంతరం ఉండవల్లి లోని సిఎం చంద్రబాబు నివాసానికి సిఎం విజయ్ వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు సిఎం లు సమావేశం అయ్యారు. తెలుగు గంగ నుండి నీటి విడుదల పెంచాలని కోరారు, నీటిని పెంచే సాధ్యఅసాధ్య లను ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తునదని అన్నారు. మరోవైపు గోదావరి కావేరీ నదుల అనుసంధానం పైన చర్చిస్తారు.ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు.


















