Skip to main content

Namaste NRI

ఆది సాయికుమార్‌ కొత్త సినిమా ప్రారంభం

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా కొత్త సినిమా ప్రకటన వెలువడింది. డివైన్‌ మిస్టరీ, సస్పెన్స్‌ ప్రధానంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి నవరసన్‌ దర్శకత్వం వహిస్తారు. త్రిశూల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పాన్‌ ఇండియా స్థాయిలో ప్రశాంత్‌ జి రుద్రప్ప నిర్మిస్తున్నారు. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతాన్నందిస్తున్నారు.

అంతుచిక్కని దైవిక రహస్యాల నేపథ్యంలో ఆధ్యాత్మికత, విశ్వాసం, ప్రాచీన నమ్మకాలు ప్రధానాంశాలుగా ఓ సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ ఈ సినిమా సాగుతుందని మేకర్స్‌ తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ ఇదొక అతీంద్రియ రహస్యాల కథ అనే విషయాన్ని ధృవీకరిస్తున్నది. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్‌ బి లోక్‌నాథ్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నవరసన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events