Skip to main content

Namaste NRI

యూఏఈ చరిత్రలోనే భారీ జాక్‌పాట్ గెలిచిన భారతీయుడు!

యూఏఈ చరిత్రలోనే భారీ జాక్‌పాట్​ని గెలుచుకున్నారు అనిల్​కుమార్​ బోళ్ల. లాటరీ ద్వారా రూ.240కోట్లు పొందారు. యూఏఈ లాటరీ చరిత్రలో ఇప్పటివరకు ఇచ్చిన అత్యంత పెద్ద లాటరీ ఢ్100 మిలియన్ల (దాదాపు రూ.240 కోట్లు) జాక్‌పాట్‌ను అబుదాబిలో నివసిస్తున్న అనిల్‌కుమార్ బోళ్ల (29) భారతీయ ప్రవాసీ గెలుచుకున్నాడు. ఈయన దక్షిణ భారతదేశానికి చెందినవారు.

అక్టోబర్ 18న నిర్వహించిన 23వ లక్కీ డే ఈవెంట్‌లో ఈ డ్రా జరిగింది. 8.8 మిలియన్లలో ఒక్కరికి మాత్రమే లభించే ఈ లాటరీతో, ఈ 29 ఏళ్ల యువకుడు చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని యూఏఈ లాటరీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఈ మొత్తాన్ని ఎలా పెట్టుబడి పెట్టాలి, సరైన మార్గంలో ఎలా ఖర్చు చేయాలి అని ఆలోచిస్తున్నాను అని అనిల్​కుమార్​ అన్నారు. ఈ మొత్తం గెలిచిన తర్వాత, నా దగ్గర డబ్బు ఉంది అనిపించింది. ఇప్పుడు నా ఆలోచనలను సరైన దిశలో అమలు చేయాలి, నేను గొప్పగా ఏదైనా చేయాలనుకుంటున్నాను అని చెప్పారు. వ్యక్తిగత ఆశయాల్లో భాగంగా, ఒక సూపర్ కార్ కొనుగోలు చేయాలని, ఒక లగ్జరీ రిసార్ట్‌లో ఈ విజయాన్ని గ్రాండ్‌గా జరుపుకోవాలని ఆయన ప్లాన్ చేసుకున్నారు. అలాగే తన కుటుంబాన్ని యూఏఈకి తరలించి, వారికి ఆర్థికంగా మద్దతు ఇవ్వాలని కూడా ఆయన వెల్లడించారు. నా కుటుంబాన్ని యూఏఈకి తీసుకురావాలి, వారితో కలిసి నా జీవితాంతం సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను అని అన్నారు. మా అమ్మ, నాన్నలకు చాలా చిన్న చిన్న కలలు ఉన్నాయి. వారి కలలన్నింటినీ నెరవేర్చాలి, వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events