Namaste NRI

కివీస్ పై టీమిండియా విజయం

సొంతగడ్డపై టీమ్‌ఇండియా జైత్రయాత్ర కొనసాగుతున్నది. టెస్టు క్రికెట్‌ చరిత్రలో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో కోహ్లీసేన, భారత గడ్డపై వరుసగా 14వ టెస్టు సిరీస్‌ చేజిక్కించుకుంది. కొండంత లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ మూడో రోజే సగం వికెట్లు పడగొట్టేందుకు మన వాళ్లకు డజను ఓవర్లు కూడా పట్టలేదు. అశ్విన్‌, జయంత్‌ చెరో నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకోవడంతో గంటలోపే కివీస్‌ పోరాటం ముగిసింది. కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక టీ20 సిరీస్‌ నెగ్గిన రాహుల్‌ ద్రవిడ్‌, టెస్టు             ఫార్మాట్‌లోనూ బోణీ కొట్టాడు. స్వదేశంలో సూపర్‌ సక్సెస్‌ అయిన కోచింగ్‌ స్టాఫ్‌కు ఈ నెలాఖరున దక్షిణాఫ్రికా పర్యటనలో సిసలు పరీక్ష ఎదురు కానుంది.

                ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో 372 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. 540 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ భారత స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 1`0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత బౌలరల్లో రవిచంద్రన్‌ అశ్విన్‌, జయంత్‌ యాదవ్‌ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు సాధించగా,  కివీస్‌ కేవలం 62 పరుగులకే అలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 276 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. కాగా టెస్ట్‌లో న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాద్‌ పటేటల్‌ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి అరుదైన రికార్డు సాధించాడు.

Social Share Spread Message

Latest News