Namaste NRI

సౌదీలో ప్రమాదం.. ప్రవాస భారతీయులు మృతి

సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రవాస భారతీయులు మృతి చెందారు. కేరళాలోని కోజికోడ్‌ జిల్లాలోని బైపోర్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ జబీర్‌ కుటుంబంతో కలిసి సౌదీలోని జుబైల్‌లో నివసిస్తున్నాడు. ఇటీవల అతనికి జుబైల్‌ నుంచి జిజాన్‌లో ఉన్న ప్రాంతానికి బదిలీ జరిగింది. డిసెంబరు 4న జుబైల్‌ కొత్త ఆఫీసులో చేరేందుకు బయల్దేరారు. భార్య షబ్నంతో పాటు ముగ్గురు పిల్లలు కారులో వెళ్లగా లగేజీ ట్రక్‌ వేరుగా వెళ్లింది. అయితే లగేజ్‌ ట్రక్‌ గమ్యస్థానం చేరుకున్నా జబీర్‌ కుటుంబం గమ్యస్థానం చేరుకోలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు అక్కడున్న ఎన్నారైలను కాంటాక్ట్‌ అయ్యారు.  జబీర్‌ కుటుంబం కారులో జుబైల్‌ నుంచి జిజాన్‌కి వెళ్తుండగా మార్గమధ్యంలో బిషా దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు తేలింది. జబీర్‌ కుటుంబం ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో ప్రమాద స్థలిలోనే కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డారు.

Social Share Spread Message

Latest News