Namaste NRI

భారత్ వీడిన ఎన్నారైలను తిరిగి స్వదేశంవైపు : కేంద్రం

భారత్‌లో మేథో వలసలను అడ్డుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని కేంద్రం స్పష్టం చేసింది. భారత్‌లో ఐఐటీ, ఐఐఎమ్‌ లాంటి ప్రఖ్యాత విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు దేశంలోనే కొనసాగేలా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్‌ సర్కార్‌ లోక్‌సభలో మాట్లాడుతూ మేథోవలసలను నిరోధించడంతో పాటూ ఇప్పటికే భారత్‌ వీడిన ఎన్నారైలను కూడా తిరిగి స్వదేశంవైపు ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ దిశగా ఐఐటీలు, ఐఐఎస్‌సీలో రీసెర్చ్‌ పార్కులను ఏర్పాటు చేయబోతున్నట్టు పేర్కొన్నారు. కొత్త టెక్నాలజీలు, స్టార్టప్‌లకు ఊతం ఇచ్చేలా వివిధ విద్యాసంస్థల్లో ఇంక్యుబేషన్‌ సెంటర్లను కూడా నెలకొల్పుతామన్నారు.

Social Share Spread Message

Latest News