Skip to main content

Namaste NRI

అనీష్, అనశ్వర రాజన్ ఇట్లు అర్జున.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు

మూగ యువకుడి ప్రేమకథగా రూపొందిన చిత్రం ఇట్లు అర్జున. అనీష్‌, అనస్వర రాజన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా మహేష్‌ ఉప్పల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వెంకీ కుడుముల నిర్మాత. ఈ చిత్రానికి అగ్ర నటుడు నాగార్జున సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్‌ 13న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

మూగ యువకుడు అర్జున్‌ చుట్టూ నడిచే కథ ఇది. అతను కీర్తి అనే అమ్మాయిని మౌనంగా ప్రేమిస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన జీవితంలో ఎదురైన అనూహ్య సంఘటనలు ఏమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. ప్రేమ, హాస్యం, సాహసం కలబోసిన హృద్యమైన కథ ఇది. నాగార్జునగారు ఈ సినిమా చూసి విభిన్నమైన కాన్సెప్ట్‌ అని అభినందించారు అని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి తమన్‌ స్వరకర్త.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events