Skip to main content

Namaste NRI

దాదా దీపావళి స్పెషల్ పోస్టర్‌ రిలీజ్ ..దాదా ధమాకా రిలీజ్ ఎప్పుడంటే?

బాలయ్య బాబు, గోపీచంద్ మలినేని కలయికలో రాబోతున్న దాదా సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా చిత్ర బృందం మొదటి పాట రిలీజ్ డేట్ ను ప్రకటించింది. థమన్ సంగీతం అందించిన దాదా ధమాకా అనే మొదటి పాటను 2026 నవంబర్ 13న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ఈ సాంగ్ అప్‌ డేట్‌ తో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలై, సినిమా విడుదలయ్యే వరకు కొనసాగుతాయి.

కాగా ఈ పాటలో నర్గీస్ ఫక్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా కోసం బాలయ్య సరికొత్త మేకోవర్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 24, 2026న క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events