Skip to main content

Namaste NRI

చార్లెట్ ‌లో తానా (TANA) ఆధ్వర్యంలో ‘అడాప్ట్ ఏ స్ట్రీట్’ కార్యక్రమం విజయవంతం

అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం చార్లెట్ ‌లో తానా అప్పలాచియన్ రీజియన్ ఆధ్వర్యంలో ‘అడాప్ట్ ఏ స్ట్రీట్ – ఫేజ్ 2’ కార్యక్రమాన్ని నవంబర్ 7, విజయవంతంగా నిర్వహించారు.దక్షిణ చార్లెట్ ప్రాంతంలోని ఆర్డ్రీ కెల్ రోడ్, టామ్ షార్ట్ రోడ్ అనే రెండు ప్రధాన రహదారులను దత్తత తీసుకుని, వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది విద్యార్థి వాలంటీర్లు తమ తల్లిదండ్రులు, తానా సభ్యులు మరియు స్థానిక నాయకత్వ బృందంతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, సామాజిక బాధ్యతపై అవగాహన పెంపొందించడంతో పాటు, స్థానిక సమాజానికి సేవ చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా చార్లెట్ సిటీ కౌన్సిల్ తానా బృందం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించి, రెండు ముఖ్యమైన రహదారులను దత్తత తీసుకుని సమాజ సేవలో భాగస్వాములు కావడం పట్ల ప్రశంసలు వ్యక్తం చేసింది.

కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి వాలంటీర్లకు, వారిని ప్రోత్సహించి సహకరించిన తల్లిదండ్రులకు, తానా సభ్యులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు ప్రత్యేకంగా అభినందించారు..

తానా అప్పలాచియన్ రీజియన్ నాయకత్వ బృందం రవి (నాని) వడ్లమూడి, ఠాగూర్ మల్లినేని, కిరణ్ కొత్తపల్లి, నాగ పంచుమర్తి, మాధురి ఏలూరి, కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.

సమాజ సేవ, పర్యావరణ పరిరక్షణ, స్థానిక సమాజ అభివృద్ధి లక్ష్యంగా భవిష్యత్తులోనూ ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తానా అప్పలాచియన్ రీజియన్ – చార్లెట్ ప్రతినిధులు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events