ఇంగ్లాండ్‌లోని కోవెంట్రీలో కోవెంట్రీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రెడ్ రోజ్ ఎరీనాలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోవెంట్రీ, రగ్బీతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు కుటుంబాలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలరించిన వేదికపై చిన్నారుల యాంకరింగ్ నృత్య ప్రదర్శనలు, ఆటలు, పాటలు, వినోదభరితమైన కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.


చిన్నారులతో కలిసి పద్మావతి పులమారసెట్టి ప్రదర్శించిన నవదుర్గా నృత్యం వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీపావళి ఇతివృత్తంతో చిన్నారులు ప్రదర్శించిన సంగీత కార్యక్రమం ఆహూతులను ఆకట్టుకుంది. మెట్ గాలా ఫ్యాషన్ వాక్, భక్తి ప్రధానమైన డివోషనల్ కార్యక్రమాలు వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి. అతిథులకు రుచికరమైన విందు భోజనంతోపాటు రిటర్న్ గిఫ్ట్స్ గా స్వీట్లు, పటాసులు అందజేశారు.
















