Namaste NRI

బిపిన్ రావత్ మృతిపట్ల యూఎస్ ఎంబసీ సంతాపం

భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులికతో పాటు 12 మంది సైనికులు దుర్మరణం చెందడం పట్ల యూఎస్‌ ఎంబసీ ( అమెరికా రాయబార కార్యాలయం) సంతాపం ప్రకటించింది. భారత తొలి సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఇండియన్‌ మిలటరీని అభివృద్ధి చేసేందుకు ఎంతో పాటుపడ్డారు అని పేర్కొన్నది. భారత రక్షణ శాఖను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేశారని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐదు రోజుల పాటు అమెరికాలో పర్యటించిన బిపిన్‌ రావత్‌ జనరల్‌ మార్క్‌ మిల్లీతో మిలటరీ అభివృద్ధితో పాటు సారూప్య దేశాలతో సహకారాన్ని పెంపొదించుకునే అవకాశాలపై రావత్‌ చర్చించినట్లు తెలిపింది.

Social Share Spread Message

Latest News