Skip to main content

Namaste NRI

బుల్లెట్ సత్యం ట్రైలర్ విడుదల చేసిన నటుడు వినోద్ కుమార్

దేవరాజ్‌, సోనాక్షి వర్మ జంటగా మదు గోపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బుల్లెట్‌ సత్యం. లక్ష్మీ నారాయణ సమర్పణలో సాయితేజ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై దేవరాజ్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సినిమా ట్రైలర్‌ని ప్రముఖ నటుడు వినోద్‌ కుమార్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ దేవరాజ్‌కు ఇది మొదటి సినిమా అయినా హీరోగా, నిర్మాతగా చక్కగా చేశాడు. గ్రామీణ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో రాజకీయ నేపథ్యం ఉన్న పాత్ర చేశాను అన్నారు. మా సినిమా రియలిస్టిక్‌గా ఉంటుంది. యాజమాన్య మంచి సంగీతం అందించారు అన్నారు హీరో, నిర్మాత దేవరాజ్‌. ఒక ఎంపీటీసీ స్థానం కోసం ఎలా పరితపిస్తారు? ఆ పదవి కోసం హీరో జీవితంలో ఏం కోల్పోయాడు? ఎవరితో తలపడాల్సి వచ్చింది అనేదే చిత్రకథ అన్నారు మధు గోవు. ప్రసాద్‌శర్మ, శంకర్‌, అభిలాష్‌ రెడ్డి తదితరులు ఈ వేడుకకి అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చలాకీచంటి, ధన్‌రాజ్‌, గీత రచయిత రాంబాబు గోసాల తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News