Skip to main content

Namaste NRI

భారత్‌, నేపాల్ మధ్య కీలక చర్చలు

భారత్‌, నేపాల్ మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కీలక చర్చలు జరిపాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ, నేపాల్‌ ప్రధాని బాలెన్ షా కలిసి జెండా ఊపి అయోధ్య-జానకీ ధామ్ రైలును ప్రారంభించారు. రెండు పొరుగు దేశాల మధ్య సరిహద్దు అనుసంధానాన్ని, మతపరమైన పర్యాటకాన్ని ఇది బలోపేతం చేస్తుందని వారు ఆకాంక్షించారు. నేపాల్‌ ప్రధాని బాలెన్ షా తొలిసారి భారత్‌ పర్యటన కోసం ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోదీతో ఆయన భేటీ అయ్యారు. ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ధామ్‌ను నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్‌తో కలిపే సరయూ కమలా ఎక్స్‌ప్రెస్ అనే కొత్త రైలు సర్వీసును ఇరు దేశాల ప్రధానులు జెండా ఊపి వర్చువల్‌గా ప్రారంభించారు.

కాగా, వారంలో ఒకసారి నడిచే ఈ రైలు ఉత్తర ప్రదేశ్, బీహార్, నేపాల్‌లోని ముఖ్య గమ్యస్థానాలను కలుపుతుంది. గోరఖ్‌పూర్, బస్తీ, రక్సౌల్, సీతామర్హి, మధుబని, జయనగర్ స్టేషన్లలో ఇది ఆగుతుంది. శ్రీరాముడు, జానకి దేవితో సంబంధం ఉన్న ఈ రెండు పుణ్యక్షేత్రాలను సందర్శించే భక్తుల ప్రయాణాన్ని ఇది మరింత సౌకర్యవంతం చేస్తుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events