Skip to main content

Namaste NRI

మళ్లీ సీఈవోగా జెన్సన్‌ హువాంగ్‌

ప్రముఖ చిప్‌ తయారీ సంస్థ ఎన్విడియా ప్రెసిడెంట్‌, సీఈవోగా జెన్సన్‌ హువాంగ్‌ తిరిగి నియమితులయ్యారు. ఆయన పునర్నియామకానికి బోర్డు ఆమోదం తెలిపింది. చైనా గూఢచారి అయి ఉండవచ్చన్న అనుమానాలున్న మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో జెన్సన్‌ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎన్విడియాకు నాయకత్వం వహించడానికి జెన్సెనే సరైన వ్యక్తి అని, ఆయనను తిరిగి నియమించడం మా వాటాదారులు, ఉద్యోగులు, భాగస్వాములు, వినియోగదారుల ప్రయోజనాలకు అనుకూలమని బోర్డు భావిస్తున్నది అని బోర్డు చైర్మన్‌ హార్వే సి. జోన్స్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

జెన్సన్‌ పునర్నియామకం గురించి ఆయనతో మాట్లాడానని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. సీఎన్‌బీసీతో మాట్లాడుతూ జెన్సన్‌ పునర్నియామకానికి తానే కారణమని ట్రంప్‌ పేర్కొన్నారు. నా జోక్యం చాలా ముఖ్యమైందని నేను నమ్ముతున్నాను అని అన్నారు. జెన్సన్‌ తిరిగి రావడంపై జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలు లేవని తన ప్రభుత్వం ఎన్విడియాకు హామీ ఇచ్చిందని ట్రంప్‌ చెప్పారు. బోర్డు సమావేశంలో ఫోన్‌ ద్వారా మాట్లాడారా అన్న ప్రశ్నకు ట్రంప్‌ సమాధానం చెప్పలేదు. అయితే, సాధారణంగా చెప్పాలంటే బోర్డులో నాకు ప్రాతినిధ్యం ఉన్నద అని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events